తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యురాలి నిర్లక్ష్యంతో మహిళ మృతి - vaidyula-nirlakshyam-mahila-mruthi in Nalgonda district

మరోసారి వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలైంది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేటలో మహిళకు సరైన వైద్యం అందక మరణించింది. వైద్యురాలి నిర్లక్ష్యంతోనే చనిపోయిందని బంధువులు ఆరోపించారు.

వైద్యురాలి నిర్లక్ష్యంతో మహిళ మృతి

By

Published : May 7, 2019, 10:39 PM IST

Updated : May 7, 2019, 10:52 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో వైద్యురాలి నిర్లక్ష్యంతో ప్రసవం కోసం వచ్చిన మహిళ మరణించింది. తమకు న్యాయం చేయాలంటూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. నార్కట్‌పల్లి మండలం కొండాపాకగూడెం గ్రామానికి చెందిన 26ఏళ్ల మానస..గత నెల 14న ప్రసవం కోసం రామన్నపేటలోని విజయ ఆసుపత్రికి వచ్చింది. వైద్యురాలు విజయలక్ష్మి ఆమెకు శస్త్రచికిత్స చేసింది. అధిక రక్తస్రావం కావటం వల్ల హైదరాబాద్ వెళ్లాలని సూచించింది. ఎల్బీనగర్​లోని శ్రీకర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించటం వల్ల ఈ రోజు ఉదయం మహిళ మరణించింది. వైద్యురాలి నిర్లక్ష్యంతోనే మహిళ మరణించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ... బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

వైద్యురాలి నిర్లక్ష్యంతో మహిళ మృతి
Last Updated : May 7, 2019, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details