తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్​లో కాంగ్రెస్, తెరాస మధ్యనే పోటీ: ఉత్తమ్​

నాగార్జున సాగర్‌లో మాజీ మంత్రి జానారెడ్డి విజయం ఖాయమైందని, అక్కడ భాజపా పోటీలోనే లేదని.. కాంగ్రెస్, తెరాస మధ్యనే పోరు ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. భాజపా, తెరాసలు చీకటి ఒప్పందంలో భాగంగానే భాజపా బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టిందని ఆరోపించారు.

By

Published : Apr 5, 2021, 6:41 PM IST

uttam kumar news today, Sagar by election news
సాగర్​లో కాంగ్రెస్, తెరాస మధ్యనే పోటీ: ఉత్తమ్​

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో మాజీ మంత్రి జానారెడ్డికి పోటీ లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ‌కుమార్‌ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​, తెరాస మధ్య పోరు కొనసాగుతుందని, భాజపా అసలు పోటీలోనే లేదని విమర్శించారు. జూమ్​ యాప్‌ ద్వారా మండల స్థాయి నాయకులతో సమావేశమైన ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. బయట కుస్తీ, లోపల దోస్తీతో తెరాస, భాజపాలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.

భాజపా ఎంపీ సోయం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ప్రధాన మంత్రికి లేఖ రాశాడని తెలిపారు. ఈ విషయంలో భాజపా, తెరాసల వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చామన్నారు. అందుకే లక్షలాది లంబాడీ బిడ్డలు విద్య, ఉద్యోగాల్లో గొప్ప వారు అయ్యారని అన్నారు. ఈ విషయాలను కాంగ్రెస్ నాయకులు, లంబాడా బిడ్డలకు అర్థమయ్యేలా చెప్పి పార్టీకి లాభం జరిగేలా చూడాలన్నారు.

ఎక్కడ అక్రమాలు బయటపడ్డా తెరాస ఎమ్యెల్యేల పేర్లు బయటకు వస్తున్నాయని ఉత్తమ్​ పేర్కొన్నారు. తాజాగా డ్రగ్స్ మాఫియాలో నలుగురు ఎమ్యెల్యేలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఆ ఎమ్యెల్యేలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియాలలో తెరాస నేతల హస్తం ఉండేది.. ఇప్పుడు డ్రగ్స్ మాఫియాలో కూడా వాళ్లే ఉన్నారని ఆరోపించారు. ఈ ఉప ఎన్నిక ఒక నియోజకవర్గంలో జరుగుతున్నా.. ఇది రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నికలుగా నిలుస్తాయని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి :ఆయన ఇన్నాళ్లు చేసింది ఏమీ లేదు: జగదీశ్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details