నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి హాజరై.. సుమారు 1400 మంది ఉపాధ్యాయులకు 10 కేజీల బియ్యం, నిత్యావసర సరకులను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విద్యా వాలంటరీలకు జీతాలు రావడం లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మెమొరాండం సమర్పించారు.
కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూసివేయడం వల్ల జీతాలు లేక ప్రైవేట్ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు. వారికి బీఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరకులు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్య విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌ను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.