తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాసను ఓడిస్తేనే అభివృద్ధి: ఉత్తమ్​ కుమార్​ రెడ్డి - municipal Elections in telangna

పుర ఎన్నికల్లో తెరాసను ఓడిస్తేనే అభివృద్ధి పథకాలకు ముందడుగు పడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండలో పర్యటించిన ఆయన అధికార పార్టీ తీరును తప్పుబట్టారు.

uttam kumar reddy campaign in nalgonda
తెరాసను ఓడిస్తేనే అభివృద్ధి: ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

By

Published : Jan 19, 2020, 3:21 PM IST

ముఖ్యమంత్రిగా కేసీఆర్, పురపాలక మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన పార్లమెంటు నల్గొండలో పర్యటించారు. అధికార పార్టీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇన్నాళ్లూ అన్ని అంశాలపై భాజపాకు కేసీఆర్ సర్కారు మద్దతు పలికిందని.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికైనా శాసనసభలో తీర్మానం చేయాలన్నారు. అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్​ కైవసం చేసుకుంటుందని చెప్పారు. హస్తం పార్టీ కార్యకర్తలు అందరూ ప్రచారంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

తెరాసను ఓడిస్తేనే అభివృద్ధి: ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details