నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో భాజపాను గెలిపిస్తే నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకువస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు నాగార్జునసాగర్-హైదరాబాద్ మార్గంలో పారిశ్రామిక కారిడార్ అందుబాటులోకి తెస్తామన్నారు.
'సాగర్'లో గెలిపిస్తే నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయం: కిషన్‌రెడ్డి - telangana latest news
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సాగర్ ఉపఎన్నికలో కమలం గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. భాజపాను గెలిపిస్తే నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
హాలియాలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం
ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థి రవికుమార్‌తో కలిసి ఆయన పలు గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం హాలియాలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఇదీ చూడండి: క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం: శ్రీనివాస్‌గౌడ్