Munugode by poll Evms: మునుగోడు బైపోల్ ఓటింగ్ అనంతరం ఈవీఎంలను తీసుకెళ్తున్న బస్సును కొందరు కారులో వెంబడించడం కాసేపు కలకలం రేపింది. ఈవీఎంలతో నల్గొండ వెళ్తున్న బస్సును కారులో కొందరు వెంబడించారు. అదేపనిగా తమ బస్సు వెంటే వస్తుండటంతో.. అనుమానించిన పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకునేందుకు కిందకు దిగారు.
మునుగోడు బైపోల్ ఈవీఎంలను ఎత్తుకెళ్లాలనుకున్నారా..? - మునుగోడు బైపోల్ ఈవీఎంలు
Munugode by poll Evms: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌లో పెద్దగా అల్లర్లు జరగకపోయినా.. చివర్లో ఈవీఎంలను తీసుకెళ్తున్న బస్సును కొందరు వెంబడించడం టెన్షన్‌కు దారితీసింది. ఈవీఎంలను తీసుకెళ్లే బస్ వెంటే వారు తమ కారులో వస్తుండటంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకున్నారు. అయితే పోలీసులు అనుమానితుల కారును స్వాధీనం చేసుకున్నారు.
Munugode by Election Evms
పోలీసులను చూసిన వాహనంలోని ఐదుగురు వ్యక్తులు కారును అక్కడే వదిలి పారిపోయారు. పోలీసులు కారును జప్తు చేశారు. ఈవీఎంలను ఎత్తుకెళ్లేందుకే వారు కారులో వచ్చి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను నల్గొండ తరలించారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు.. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నారు.
ఇవీ చదవండి: