నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ యధేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్న 200 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అధిక ధరలకు అమ్ముతున్న ఓ మెడికల్ షాప్, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఒక కిరాణా దుకాణానికి పోలీసులు తాళం వేశారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు ఇచ్చిన గడువు తీరిన తర్వాత కూడా చిన్న కారణాలతో రోడ్లపైకి వస్తున్నారని టూ టౌన్ సీఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బయట తిరిగితే కరోనా తప్పదు...