నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం రామానుజపురం గ్రామానికి చెందిన సైదులు, నరేశ్ అనే వ్యక్తుల ద్విచక్ర వాహనాలు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దగ్ధమయ్యాయి. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... సైదులు, నరేశ్‌లు ద్విచక్ర వాహనాలను ఓ వ్యవసాయ క్షేత్రం వద్ద నిలిపి ఉంచారు. అదే సమయంలో ఆ వ్యవసాయ క్షేత్రంలో వ్యర్థాలను దగ్ధం చేసేందుకు నిప్పు పెట్టారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అక్కడే పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలకు అంటుకోవడం వల్ల అవి పూర్తిగా కాలిపోయాయని స్థానికులు తెలిపారు.
ప్రమాదవశాత్తు రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధం - రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధం
ప్రమాదవశాత్తు నిప్పంటుకొని రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం రామానుజపురం గ్రామంలో జరిగింది.

ద్విచక్ర వాహనాలు దగ్ధం