నల్గొండ జిల్లా తిరుమలగిరిలో శనివారం ప్రారంభమైన ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. కోనేటిపురంలో శ్రీ తిరుమలనాథ స్వామి కల్యాణం సందర్భంగా ఈ పోటీలను నిర్వహించారు. ఆదివారంతో ఈ పోటీలు ముగియనున్నాయి.
రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలు - telangana latest news
నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో తెలుగు రాష్ట్రాల ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శనివారం ప్రారంభమైన పోటీలు ఆదివారంతో ముగియనున్నాయి. కోనేటిపురంలో శ్రీ తిరుమలనాథ స్వామి కల్యాణం సందర్భంగా ఈ పోటీలను నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల స్థాయి ఎద్దుల బరువు లాగుడు పోటీలు
రాష్ట్రం నుంచే కాకుండా ఏపీలోని గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కడప జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఎద్దులు పోటీలకు వచ్చాయి. ఈ పోటీల్లో పాల్గొనే ఎద్దులు 2 టన్నుల బరువున్న బండను 200 అడుగుల దూరం వరకు లాగాల్సి ఉంటుంది. తక్కువ సమయంలో లాగిన వాటికి మొదటి బహుమతిగా రూ.50 వేలు అందించనున్నారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బ్యాలెట్ బాక్సులు!
Last Updated : Mar 1, 2021, 9:06 AM IST