రేషన్ బియ్యం పట్టివేత.. ఇద్దరు అరెస్టు - Two persons arrested for illegally moving ration rice
లాక్డౌన్ సమయంలో కూడా అక్రమ దందాలు ఆగడం లేదు. దళారులు రేషన్ బియ్యాన్ని ప్రజల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని దొంగ చాటుగా తరలిస్తున్నారు.
లాక్డౌన్ వేళ... అక్రమ తరలింపులు
నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలోని రాగడప వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 33 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే చర్యలు తీసుకొంటామని త్రిపురారం ఎస్సై రామ్మూర్తి హెచ్చరించారు.