నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్ ఫ్లైఓవర్ వద్ద విషాదం చోటు చేసుకుంది. ఆగివున్న లారీని అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా... డైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన వ్యాధిగ్రస్తుడిని అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 'కనులు కనులను దోచాయంటే' నిర్మాతల్లో ఒకరైన నందగోపాల్‌రెడ్డి(75) ఆరోగ్యం సరిగా లేకపోవడంతో... అతని కుమారుడు కమలాకర్‌రెడ్డిని తోడుగా తీసుకుని అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు బయల్దేరారు.