నాగార్జున సాగర్(Nagarjuna sagar) జలాశయానికి వరద తగ్గడంతో అధికారులు ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మూసివేశారు. వరద ప్రవాహాన్ని బట్టి ఈ నెల 1నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. నిన్నటి వరకు 6 క్రస్ట్ గేట్లు ఎత్తి ఉండగా.. నేటి ఉదయం వరకు 2 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగింది. ఎగువ నుంచి వరద నీరు తగ్గిపోవడంతో ఆ రెండు గేట్లను కూడా మూసి వేశారు.
ప్రాజెక్టుకు ప్రస్తుతం 50 వేల 904 క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే మొత్తంలో ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 33వేల క్యూసెక్కులు, సాగర్ కుడి, ఎడమ కాల్వలకు కలిపి 15వేల క్యూసెక్కుల సాగునీటిని, ఏఎమ్మార్పీకి 2400 క్యూసెక్కులు, లో లెవెల్ కాల్వకు 500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.