ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు కృష్ణమ్మ ఉరకలేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద నీరు చేరడం వల్ల.. 4,49,433 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతితో నిండుకుండలా మారిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు 20 గేట్లను 10 ఫీట్ల వరకు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
నాగార్జునసాగర్ 20 గేట్లు ఎత్తి నీటి విడుదల
ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్‌కు వరద నీరు భారీగా చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 4,49,433 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడం వల్ల నాగార్జునసాగర్ జలాశయం 20 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ 20 గేట్లు ఎత్తి నీటి విడుదల
సాగర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టమైన 590 అడగుల మేర ప్రస్తుతం నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312.04 టీఎంసీలకు.. 311.14 టీఎంసీల వద్ద నిల్వ ఉండేలా చేస్తూ.. నీటిని విడుదల చేస్తున్నారు.