ఏప్రిల్ 9న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో కొత్త పార్టీ విధివిధానాలు వైఎస్ షర్మిల ప్రకటించే అవకాశం ఉందని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నాయకులు బాలంల మధు అన్నారు. వైఎస్సార్ సంకల్ప సభ గోడ ప్రతులను ఆయన ప్రారంభించారు. రానున్న రోజుల్లో రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ షర్మిల వెంట ప్రజలు ఉండాలని కోరారు.
'వైఎస్సార్ సంకల్ప సభను విజయవంతం చేయాలి' - telangana news
రాజన్న సంక్షేమ పాలన కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ... షర్మిల వెంట ప్రజలు నడవాలని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నాయకులు బాలంల మధు అన్నారు. ఈ నెల 9న ఖమ్మం జిల్లా కేంద్రంలో జరగబోయే వైఎస్సార్ సంకల్ప సభ గోడ ప్రతులను ఆయన ప్రారంభించారు.
వైఎస్సార్ సంకల్ప సభ గోడ ప్రతులను ప్రారంభించిన సూర్యాపేట జిల్లా వాసులు
రాజన్న సంక్షేమ పాలన కోసం షర్మిల సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిర్రబోయిన కొమురయ్య, పల్లెపు సమ్మయ్య, ఆలకుంట్ల నర్సింహ, దొంతోజు నవీన్ చారి తదితరులు పాల్గొన్నారు.