నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 33వ రోజూ కొనసాగుతోంది. కార్మికులు పట్టణంలోని సుభాష్ విగ్రహం నుంచి బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. డిపో ముట్టడికి యత్నించారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నల్గొండ బస్ డిపో మట్టడికి ఆర్టీసీ కార్మికుల యత్నం - TSRTC WORKERS STRIKE AT NALGONDA
నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 33వ రోజుకు చేరుకుంది. పలు రాజకీయ పార్టీల మద్దతుతో కార్మికులు ధర్నా చేశారు.
![నల్గొండ బస్ డిపో మట్టడికి ఆర్టీసీ కార్మికుల యత్నం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4976436-464-4976436-1573025231990.jpg)
నల్గొండ బస్ డిపో మట్టడికి ఆర్టీసీ కార్మికుల యత్నం
కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు కార్మికులను విధుల్లో చేరమని భయపెడ్తున్నారని కార్మికులు ఆరోపించారు. అలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేవరకు వారికి తోడుగా అఖిల పక్ష పార్టీల, ఇంటి పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు.
నల్గొండ బస్ డిపో మట్టడికి ఆర్టీసీ కార్మికుల యత్నం
ఇవీ చూడండి: డెడ్‌లైన్‌లోపు విధుల్లో చేరిన 487 మంది ఆర్టీసీ కార్మికులు