తెలంగాణ

telangana

ETV Bharat / state

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్​ మృతి - గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్​ మృతి

నల్గొండ జిల్లా దేవరకొండలో గుండెపోటుతో ఓ ఆర్టీసీ డ్రైవర్​ మృతి చెందాడు. ఆయన మృతికి ప్రభుత్వమే కారణమని దేవరకొండ డిపో ముందు కుటుంబ సభ్యులు, కార్మికులు ధర్నా నిర్వహించారు.

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్​ మృతి

By

Published : Nov 4, 2019, 6:16 AM IST

Updated : Nov 4, 2019, 7:18 AM IST

నల్గొండ జిల్లా దేవరకొండలో ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. నాంపల్లి మండలం పగిడిపల్లి గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి దేవరకొండ డిపోలో డ్రైవర్​గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం వరకు కార్మికులు డిపో ముందు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో పాల్గొన్నాడు. ఇంటికి వెళ్లిన జైపాల్​రెడ్డికి రాత్రి గుండెపోటు రావడం వల్ల కుటుంబ సభ్యులు దేవరకండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్​ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహంతో దేవరకొండ డిపో ముందు కుటుంబ సభ్యులు,కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నారు.

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్​ మృతి

ఇవీ చూడండి: ఎమ్మెల్యే పీఏ గల్లంతు... పోలీసుల వెతుకులాట!

Last Updated : Nov 4, 2019, 7:18 AM IST

ABOUT THE AUTHOR

...view details