తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామాల అభివృద్ధే తెరాస లక్ష్యం: నల్లమోతు భాస్కర్

ప్రాదేశిక ఎన్నికలకు రెండో విడత పోలింగ్ దగ్గరపడుతుండడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో తెరాస అభ్యర్థులకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ప్రచారంను నిర్వహించారు.

By

Published : May 7, 2019, 8:00 PM IST

గ్రామాల అభివృద్ధే తెరాస లక్ష్యం: నల్లమోతు భాస్కర్

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో కారు పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. తెరాస అభ్యర్థుల గెలుపుతోనే మండలంలోని గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు గెలుపుకు కారణమవుతాయని అన్నారు. తెరాస అధికారం చేపట్టిన తర్వాతే ముఖ్యమంత్రి పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి గ్రామ అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధిగా భావించి ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.

గ్రామాల అభివృద్ధే తెరాస లక్ష్యం: నల్లమోతు భాస్కర్

ABOUT THE AUTHOR

...view details