సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నల్గొండ జిల్లా అనుములలో సీఎం కేసీఆర్ నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 14న నిర్వహించనున్న కార్యక్రమానికి.. తెరాస శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఏర్పాట్ల గురించి నాయకులను అడిగి తెలుసుకున్నారు.
సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని
సాగర్ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార పార్టీ తరఫున.. సీఎం కేసీఆర్ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. నల్గొండ జిల్లా అనుములలో ఈనెల 14న కేసీఆర్ పాల్గొనబోయే సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయా పనులను పలువురు ప్రజాప్రతినిధులు పరిశీలించారు.
అనుముల బహిరంగ సభ
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు ఎంపీలు.. బడుగుల లింగయ్య, బండ ప్రకాశ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్, తదితరులు... పనులను పర్యవేక్షించారు.
ఇదీ చదవండి:సీఎం కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: కేటీఆర్