తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తెరాస విజయం

trs onj in sagar by election
నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తెరాస విజయం

By

Published : May 2, 2021, 2:45 PM IST

Updated : May 2, 2021, 5:06 PM IST

14:44 May 02

నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తెరాస విజయం

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తెరాస విజయం సాధించింది. కాంగ్రెస్‌ నేత జానారెడ్డిపై 18,872 ఓట్ల తేడాతో తెరాస అభ్యర్థి నోముల భగత్‌ విజయం సాధించారు.భాజపా అభ్యర్థి రవి నాయక్​ డిపాజిట్​ కోల్పోయారు. నోముల భగత్​కు 89,804 ఓట్లు రాగా జానారెడ్డికి 70,932, రవి నాయక్​కు 7,676 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థికి 2,915 ఓట్లు రాగా తెదేపా అభ్యర్థికి 1,714 ఓట్లు పోలయ్యాయి. 

కౌంటింగ్​ ప్రారంభం నుంచి నోముల భగత్​ ఆధిక్యంలో కొనసాగారు. నోముల నరసింహయ్య అకాల మరణంతో నాగార్జునసాగర్​లో ఉప ఎన్నిక జరిగింది. తెరాస నుంచి నరసింహయ్య తనయుడు నోముల భగత్​ పోటీ చేయగా, కాంగ్రెస్​ నుంచి సీనియర్​ నేత జానా రెడ్డి, భాజపా నుంచి రవి నాయక్​ బరిలో నిలించారు. గత నెల 17 పోలింగ్​ జరిగింది.

తనపై నమ్మకం ఉంచి గెలిపించిన నాగార్జున సాగర్​ ప్రజలకు తెరాస అభ్యర్థి నోముల భగత్​ ధన్యవాదాలు తెలిపారు. తనకు టికెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్​కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాన్న నరసింహయ్య చనిపోయినా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తానన్నారు.  

 ఇదీ చదవండి:భగత్‌ను ఆశీర్వదించిన సాగర్ ప్రజలకు ధన్యవాదాలు: సీఎం

Last Updated : May 2, 2021, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details