తెలంగాణ

telangana

ETV Bharat / state

మునుగోడులో ప్రచారం చేయకుండా బండిపై నిషేధం విధించాలి: తెరాస - మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో బండి వ్యాఖ్యలు

TRS leaders complained to EC against Bandi Sanjay: మునుగోడు ప్రచారంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఈసీకి తెరాస ఫిర్యాదు చేసింది. ఓటు కోసం డబ్బులు తీసుకోవాలని అవినీతిని ప్రోత్సహించేలా బండి సంజయ్‌ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారిని కలిసిన తెరాస నేతలు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

complained to EC against Bandi Sanjay
complained to EC against Bandi Sanjay

By

Published : Oct 18, 2022, 10:58 PM IST

TRS leaders complained to EC against Bandi Sanjay:మునుగోడు ప్రచారంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఈసీకి తెరాస ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఉప ప్రధాన ఎన్నికల అధికారి సత్యవాణికి తెరాస నేతలు సోమ భరత్‌కుమార్‌, రమేష్‌రెడ్డి, దేవి ప్రసాద్‌ ఫిర్యాదు చేశారు. ఓటు కోసం డబ్బులు తీసుకోవాలని అవినీతిని ప్రోత్సహించేలా బండి సంజయ్‌ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెరాసను దండుపాళ్యం ముఠాతో పోల్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

మునుగోడు ఎన్నిక.. దేవుళ్లు, రాక్షసుల మధ్య జరుగుతోందని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారని ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారంలో బండి సంజయ్‌ దేవుడిని ప్రస్తావిస్తున్నా.. ఎన్నికల కమిషన్‌ స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఫిర్యాదులో తెరాస ప్రస్తావించింది. బండి సంజయ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి.. భాజపా స్టార్‌ క్యాంపెయినర్‌గా తొలగించాలని కోరింది. మునుగోడు ఉపఎన్నికలో ప్రచారం చేయకుండా బండి సంజయ్‌పై నిషేధం విధించాలని కోరింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details