నాగార్జున సాగర్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న తరుణంలో అధికార తెరాస పార్టీ నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచార ఇంఛార్జ్‌లు మండల ప్రజలను కలుస్తూ సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. పెద్దవూర మండలం ఇంఛార్జ్‌గా చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా కుంకుడు చెట్టు తండా, నిమా నాయక్ తండా ప్రజలతో సమావేశమయ్యారు.
ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు - telangana news today
రాష్ట్రంలో ఏప్రిల్ 17న జరగనున్న నాగార్జునసాగర్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ప్రచార జోరు పెంచారు. మండలాల వారీగా ఎమ్మెల్యేలు ఇంఛార్జ్‌లుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ నాయక్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌లు ప్రచారంలో పాల్గొన్నారు.
![ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు trs Leaders involved in the nagarjuna sagar by election campaign](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11072569-940-11072569-1616146136591.jpg)
ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు
తిరుమల మండలంలో ఉన్న డీ8, డీ9 కాల్వలను ఆ మండల ఇంఛార్జ్‌లు దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ నాయక్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ పరిశీలించి.. రైతులతో కలిసి ప్రచారం చేశారు.
హాలియా పురపాలక సంఘం ఐదోవార్డులోని ప్రజలతో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. వచ్చే సాగర్ ఉప ఎన్నికలో తెరాస పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. సాగర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి :36 మంది అభ్యర్థులు ఎలిమినేషన్