ఎమ్మెల్యే భాస్కరరావ్ కరోనా మహమ్మారి బారిన పడడం విధితమే కాగా అతను హోమ్ క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని, వైరస్ నుంచి త్వరగా కోలుకోవాలని తెరాస కార్యకర్తలు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆ ఎమ్మెల్యే మహమ్మారి నుంచి కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు - Trs leaders held special pujas in Nalgonda district to recovery from MLA Bhaskar Corona
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని తెరాస కార్యకర్తలు నల్లగొండ జిల్లా శెట్టిపాలెం గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం బాగుపడి మరల ప్రజాసేవలో పాల్గొనాలని భగవంతుడిని కోరుకున్నారు.
ఆ ఎమ్మెల్యే మహమ్మారి నుంచి కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు
నిత్యం అభివృద్ధి పనులు చేపడుతూ.. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రజాసేవకే అంకితమై ఉండేవారని.. వారు మరల కోలుకుని ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టేలా భగవంతుడు ఎమ్మెల్యేకు ఆయురారోగ్యాలను ఇవ్వాలని గ్రామ సర్పంచ్ ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:జీవనశైలిలో మార్పులు తెచ్చిన కరోనా