రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నికల్లో... ప్రస్తుతం తెరాస ముందంజలో ఉంది. భాజపా, తెరాస మధ్య హోరాహోరిగా పోరు సాగుతోంది. విజయం రెండు పార్టీల మధ్య దోబూచులాడుతోంది. ప్రతి రౌండ్‌లోనూ నువ్వా నేనా అనే విధంగా... పోటీ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఏ దశలోనూ... పోటీ ఇవ్వలేకపోతోంది. అన్ని రౌండ్లలోనూ... తెరాస, భాజపా కంటే వెనుకంజలోనే ఉంది. అయితే గెలుపు దిశగా పయనిస్తున్న తెరాస... ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రతి రౌండ్‌లోనూ తెరాస అధిక్యం.. పార్టీ శ్రేణుల సంబరాలు - మునుగోడు ఉపఎన్నిక
మునుగోడు ఉపఎన్నికలో అధికార పక్షం ముందంజలో కొనసాగుతోంది. దీనితో గెలుపు ఖాయమని ఫిక్స్ అయిన తెరాస పార్టీ శ్రేణులు... తెలంగాణ భవన్‌లో బాణసంచా కాల్చి సంబురాలు చేసుకుంటున్నాయి.
ప్రతి రౌండ్‌లోనూ తెరాస అధిక్యం.. పార్టీ శ్రేణుల సంబరాలు
తెలంగాణ భవన్‌లో తెరాస నేతల సంబురాలు మొదలయ్యాయి. ఇక గెలుపు ఖాయమని భావించిన కార్యకర్తలు.. బాణసంచా కాల్చి సంబురాలు చేసుకుంటున్నారు.
ఇవీ చూడండి: