తెరాస నాయకుడు కర్నాటి విద్యాసాగర్ ఆయన పుట్టిన రోజు కానుకగా అందించిన అంబులెన్స్‌ను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ ఎంవీ రంగనాథ్ కలిసి ప్రారంభించారు. ఈ విపత్కర సమయంలో పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని అంబులెన్స్‌ను నల్గొండ జిల్లా నాంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి అందించినట్లు తెలిపారు. ఈ ఆపత్కాలంలో అంబులెన్స్ అవసరం చాలా ఉందని ఆయన అన్నారు.
పుట్టినరోజున అంబులెన్స్అందించిన తెరాస నేత - తెలంగాణ వార్తలు
నాంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తెరాస నాయకుడు కర్నాటి విద్యాసాగర్ అంబులెన్స్ అందజేశారు. ఆయన పుట్టిన రోజు కానుకగా అందించారు. ఈ వాహనాన్ని కలెక్టర్, ఎస్పీలు కలిసి ప్రారంభించారు.
నాంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్సు, నల్గొండ జిల్లా