ఎవరెన్ని చెప్పినా... ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు. ఈ ఉపఎన్నిక కోసం దిల్లీ నుంచి కేంద్రమంత్రులు వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లా హాలియాలో తెరాస నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. నోముల భగత్‌కు వచ్చే ఓట్ల మాదిరే నెల్లికల్ లిఫ్టు నుంచి నీళ్లు దూకుతాయని చెప్పుకొచ్చారు. మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చినట్లుగా ఏడాదిన్నరలో ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఎవరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో ప్రజలు గ్రహించాలని సూచించారు. మిత్రుడు నోముల నర్సింహయ్యను కోల్పోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.