సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ తెరాస కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి హాజరై జెండా ఆవిష్కరించారు. పేద ప్రజల పాలిట తెరాస జెండా శ్రీరామ రక్ష అని ఎమ్మెల్యే అన్నారు. ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకోవాల్సిన సమయంలో కరోనా కారణంగా ఎక్కడిక్కడే నిరాడంబరంగా చేయాల్సి వచ్చిందన్నారు.
హుజూర్నగర్లో తెరాస ఆవిర్భావ వేడుకలు - తెరాస ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి
హుజూర్నగర్లో నిర్వహించిన తెరాస ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని పేర్కొన్నారు.

హుజూర్నగర్లో తెరాస ఆవిర్భావ వేడుకలు
ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల నుంచి ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సైదిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించి జెండా ఆవిష్కరణ చేపట్టాలని సూచించారు.
ఇదీ చూడండి:'దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితుల్లో మెరుగుదల'