నల్గొండ జిల్లా నిడమనూరు తహసీల్దార్ కార్యాలయంలో తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిడమనూరు రామాలయం వీధిలో ఇళ్లు కొట్టుకుపోయాయి. రెవెన్యూశాఖ అధికారులు 32 మంది లబ్ధిదారులను గుర్తించి... జాబితా తయారు చేశారు. లబ్ధిదారుల ఎంపికలో అన్యాయం జరిగిందని కాంగ్రెస్ వార్డు సభ్యురాలు మిర్యాలగూడ ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.
తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల కొట్లాట.. గాల్లో కుర్చీలు
లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ ఎంపీ, ఆర్డీవో ముందే తెరాస, కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు నెట్టుకున్నారు. ఒకానొక సమయంలో కుర్చీలు విసురుకున్నారు.
తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల కొట్లాట.. గాల్లో కుర్చీలు
ఈ క్రమంలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో విచారణ చేపట్టారు. సమాచారం తెలుసుకున్న తెరాస కార్యకర్తలు... లబ్ధిదారుల జాబితాను మారుస్తున్నారనే అనుమానంతో పెద్ద ఎత్తున్న అక్కడికి చేరుకొని ఆందోళన చేశారు. ఈ సమయంలో ఒకరినొకరు నెట్టుకుంటూ... బాహాబాహికి దిగారు. కుర్చీలను గాల్లో విసురుకున్నారు. విషయం తెలుసుకొని అక్కడకి చేరుకున్న పోలీసులు అందరిని బయటకు పంపారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని తెలిపారు.
Last Updated : Nov 12, 2020, 8:14 PM IST