నోముల నర్సింహయ్య హఠాన్మరణం చెందినప్పటి నుంచి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆయన వారసుడు ఎవరనే విషయంలో తెరాస మల్లగుల్లాలు పడుతూనే ఉంది. ఉప ఎన్నికలకు విపరీతమైన పోటీ నెలకొన్న దృష్ట్యా అన్ని పార్టీల కంటే ముందు నుంచే అంతర్గత సర్వేలు నిర్వహించింది. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, నర్సింహయ్య తనయుడు భగత్.. ఎం.సి.కోటిరెడ్డి, గురువయ్య యాదవ్ వంటి వారి పేర్లు అభ్యర్థిత్వం కోసం వినిపించాయి. ఎన్నికల వ్యూహాల్లో అందరికంటే ఒకడుగు ముందే ఉండే గులాబీ దళంలో.. సాగర్ ఎన్నిక ఆది నుంచి చర్చనీయాంశంగానే ఉంది. నామినేషన్లు ప్రారంభమై 3 రోజులు గడుస్తున్నా, నామపత్రాల దాఖలుకు... మరో 2 రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నా.. ఇప్పటికీ అభ్యర్థిత్వం ఖరారు కాలేదు. ఒకట్రెండు రోజుల్లోనే అభ్యర్థి పేరును ప్రకటించబోతోంది. ఎందుకంటే ఇవాళ్టితోపాటు.. ఈ నెల 30 నాడు మాత్రమే నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. 27, 28, 29 తేదీల్ని ఎన్నికల సంఘం సెలవుగా ప్రకటించింది.
నియోజకవర్గంపై పూర్తి దృష్టి