తెలంగాణ

telangana

ETV Bharat / state

'తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత తెరాసదే'

నాగార్జునసాగర్​ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని పలు తండాల్లో తెరాస అభ్యర్థి నోముల భగత్​ ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్​, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తన తండ్రి ఎమ్మెల్యేగా గెలుపొందారని.. ఈ ఎన్నికల్లో తనను గెలిపించి తండాల అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను కోరారు.

nomula bhagath, nagarjuna sagar bypoll
నాగార్జున సాగర్ ఉపఎన్నిక, నోముల భగత్​

By

Published : Apr 5, 2021, 2:01 PM IST

తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్​దేనని సాగర్​ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్​ అన్నారు. సీఎం, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే తన తండ్రి ఎమ్మెల్యేగా గెలుపొందారని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని బూనుతల, కుంకుడు చెట్టు తండాల్లో భగత్ ప్రచారం నిర్వహించారు. తనను ఆశీర్వదించి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని.. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను భగత్​ కోరారు.

కాంగ్రెస్​కు ఓటేస్తే...

రాష్ట్రంలో కాంగ్రెస్​ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని తెరాస మండల ఇన్​ఛార్జీ, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఆ పార్టీకి ఓటేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదని ఎద్దేవా చేశారు. తండాలకు లిఫ్ట్​ మంజూరు చేసి చివరి భూములకు సైతం సీఎం నీళ్లలందిస్తున్నారని పేర్కొన్నారు. ఇస్త్రీ షాపులకు ఉచిత కరెంటు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రచారంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీసీ కమిషన్​ మాజీ సభ్యులు ఆంజనేయులు గౌడ్​ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:సాగర్ ఉపఎన్నిక బరిపై.. యువత గురి

ABOUT THE AUTHOR

...view details