నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తెరాస ప్రచార జోరు సాగిస్తోంది. త్రిపురారం మండలంలోని సత్యనారాయణపురం, నీలాయిగూడెం, అంజనపల్లి, రాగడపలో గులాబీ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుమార్ ప్రచారం నిర్వహించారు. త్రిపురారం మండల ఎన్నికల ఇంఛార్జ్‌గా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఇతర తెరాస నేతలు పాల్గొన్నారు.
సాగర్ అభివృద్ధి తెరాసతోనే సాధ్యం: నోముల భగత్ - Nomula Bhagat sagar campaign
నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని గులాబీ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కుమార్ అన్నారు. సాగర్ ఉపఎన్నికలో కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.
నోముల భగత్, నాగార్జునసాగర్, సాగర్ ఉపఎన్నిక
తెరాస శ్రేణులు భగత్‌కుమార్‌కు.. బతుకమ్మను పేర్చి బోనాలతో స్వాగతం పలికారు. సాగర్ అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని భగత్ అన్నారు. తన తండ్రి నోముల నర్సింహయ్య ఆశయాలు సాధించడానికి తనకొక అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ఉపఎన్నికలో కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చదవండి :సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో అతిరథమహారథులు