నాగార్జునసాగర్ ఉపఎన్నికల సమయం సమీపిస్తుండటం వల్ల పార్టీలన్ని ప్రచారంలో జోరుపెంచాయి. విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాయి. హాలియా పురపాలక సంఘం పరిధిలోని 8, 9వార్డుల్లో తెరాస అభ్యర్థి నోముల భగత్ తల్లి నోముల లక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో వచ్చిన ఉపఎన్నికల్లో తమ కుటుంబానికి అండగా ఉండాలన్నారు. భగత్‌ను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. ఆమెతో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భగత్ తరఫున ప్రచారం చేశారు. నోముల భగత్‌కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ అండగా ఉన్నారని గుర్తుచేశారు.
కొడుకు గెలుపు కోసం తల్లి ఇంటింటి ప్రచారం - telangana varthalu
సాగర్ ఉపఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. కొడుకు గెలుపు కోసం తెరాస అభ్యర్థి నోముల భగత్ తల్లి నోముల లక్ష్మి ప్రచారం నిర్వహించారు. తన కొడుకును గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలన్నారు. ఆమెతో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భగత్‌కు మద్దతుగా హాలియాలో ప్రచారం చేపట్టారు.
భగత్‌కు మద్దతుగా నోముల లక్ష్మి, కోరుకంటి చందర్ ప్రచారం