రాజస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం 12 ఏళ్ల కిందట నల్గొండ జిల్లా చండూరు మండలానికి వలస వచ్చింది. దేవుళ్లు, దిష్టి బొమ్మల విగ్రహాలను తయారు చేస్తూ ఆ కుటుంబ సభ్యులు జీవనం సాగించేవారు. కానీ తయారుచేసే చోటుకు కొనుగోలుదారులు రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. అందుకే ఓ వినూత్న ఆలోచన చేశారు.
ఆలోచన బాగుంది.... అదే ఆదాయమైంది.! - trolley bike
బతుకుదెరువుకు రాష్ట్రం దాటి వలస వచ్చారు. జీవనోపాధికి దేవుళ్లు, దిష్టిబొమ్మల విగ్రహాలను తయారుచేస్తున్నారు. కానీ కొనే వాళ్లు లేకపోతే ఎన్ని తయారు చేసి మాత్రం ఏం లాభం. అందుకే వినియోగదారులు తమ దగ్గరికి రావడం లేదని ఓ వినూత్నం ప్రయత్నం చేశారు. అది ఫలించి వారికి మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.
![ఆలోచన బాగుంది.... అదే ఆదాయమైంది.! trolley bike](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11350964-1090-11350964-1618037642149.jpg)
ట్రాలీ బైక్
రూ. 70 వేలు ఖర్చు చేసి ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి దానికే ఓ ట్రాలీని ఏర్పాటు చేసుకున్నారు. వారు తయారు చేసిన బొమ్మలను ఆ ట్రాలీలో వేసుకొని ఊరూరా తిరుగుతూ అమ్ముతున్నారు. ఖర్చులు పోను రూ. 1000 వరకు కూలీ దొరుకుతుందని వారు తెలిపారు.
ఇదీ చదవండి:నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు