వాతావరణ కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ట్రాన్స్‌కో- జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు సూచించారు. ఎంపీ సంతోష్ కుమార్ 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో అవగాహన తీసుకొని రావటం సంతోషకరమన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గురువారం.. నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం క్యాంటీన్ ప్రాంగణంలో సీఎండీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్స్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
కాలుష్యం తగ్గాలంటే మొక్కలు నాటాలి: ట్రాన్స్‌కో- జెన్కో సీఎండీ - transco genco cmd news
దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యదుత్పత్తి కేంద్రంలోని క్యాంటీన్‌ను ట్రాన్స్‌కో- జెన్కో సీఎండీ ప్రభాకర్ ప్రారంభించారు. క్యాంటీన్ ప్రాంగణంలో సీఎండీ మొక్కలు నాటారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్