రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన రవాణా చట్టాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేసేందుకు నల్గొండ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి అనవసరంగా డబ్బులు వృథా చేసుకోవద్దంటూ మిర్యాలగూడ పట్టణంలో తమదైన శైలిలో ప్రచారం సాగిస్తూ వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత నెల రోజులుగా తరచూ వాహన తనిఖీలు చేపడుతున్నారు. పోలీసుల సలహా పేరుతో "నిబంధనలు పాటించండి.. డబ్బులు ఆదా చేసుకోండి" అంటూ పలు సూచనలతో అన్ని ప్రధాన కూడలిలో పెద్ద పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. మైకుల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా నూతన చట్టంపై ముమ్మర ప్రచారం చేపట్టారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. డబ్బును ఆదా చేసుకోండి - ట్రాఫిక్ రూల్స్ పాటించండి..
"డబ్బులు ఎవరికి ఊరికే రావు... ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, మీ డబ్బును ఆదా చేసుకోండంటూ..." నల్గొండ జిల్లా పోలీసులు వినూత్న ప్రచారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన రవాణా చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. డబ్బును ఆదా చేసుకోండి.