తెలంగాణ

telangana

ETV Bharat / state

'వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర' - సీపీఎం కార్మిక సంఘాల నాయకులు ధర్నా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని సీపీఎం కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. మిర్యాలగూడలోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు.

trade unions employees  protest in miryalaguda nalgonda
వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర'

By

Published : Aug 9, 2020, 5:47 PM IST

వ్యవసాయ కూలీలకు జీవన భృతి కల్పించాలని, పట్టణాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభిచాలని సీపీఎం కార్మిక సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. కేంద్రం విధానాలను నిరసిస్తూ... నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అంబేడ్కర్​ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఉపాధి హామీ పనిదినాలను 200 రోజులకు పెంచాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని... అలాంటి విధానాలను మానుకోవాలని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు.

వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కొత్త చట్టాలు తీసుకువస్తున్నారని, తక్షణమే అలాంటి ఆలోచనను విరమించుకోవాలని ప్రభుత్వాన్ని వామపక్ష కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.

ఇవీ చూడండి: కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details