నాగార్జున సాగర్ అభివృద్ధి కోసం కృషి చేస్తా: ఉత్తమ్ - tpcc
నాగార్జునసాగర్ విజయ్‌విహార్ హోటల్‌లో టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కుంతియా, ఉత్తమ్, భట్టి విక్రమార్క, జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు.
uttam
నాగార్జున సాగర్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. లోక్సభ సమావేశాలు ముగిసిన తర్వాత మళ్లీ పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావిస్తానన్నారు. గెలుపోటములు పక్కనపెట్టి... పురపాల ఎన్నికలపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సూచించారు.