తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉపకారం చేసినందుకు తాళి అమ్మాల్సిన దుర్గతి సర్పంచ్‌లది' - సర్పంచుల దుస్థితిపై రేవంత్

Revanth Tweet:ఆడపడచులకు పుస్తెలతాడు ప్రాణంతో సమానమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఊరికి ఉపకారం చేసినందుకు ఈ తాళిబొట్టునే అమ్మాల్సిన దుస్థితి మన రాష్ట్రంలో ఏర్పడిందని ట్వీట్ చేశారు. ఈ పరిస్థితిని కల్పించిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందని విమర్శించారు.

Revanth Tweet
రేవంత్‌

By

Published : May 31, 2022, 11:18 AM IST

Revanth Tweet: రాష్ట్రంలో ఓ మహిశా సర్పంచ్‌కు పుస్తెలతాడు అమ్మి వడ్డీలు కట్టే దుస్థితిని కల్పించిన సీఎం కేసీఆర్‌ నిజంగా గొప్పవారేనంటూ టీపీసీసీ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఎరుగండ్లపల్లి సర్పంచ్ మాడం శాంతమ్మ దుస్థితిపై ఆయన ట్వీట్ చేశారు.

రేవంత్‌

ఊరికి ఉపకారం చేసినందుకు తాళినే అమ్మాల్సిన దుస్థితి తెరాస పాలనలో ఏర్పడిందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వడ్డీలు కట్టేందుకు మహిళా సర్పంచ్‌కు తన పుస్తెలతాడు అమ్మే పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో పల్లెల దుర్గతికి ఎరుగండ్లపల్లి సర్పంచ్ ఉదంతమే నిదర్శనమని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details