ఉద్యోగ, నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసిన చేసిన తెరాస ప్రభుత్వానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములునాయక్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పల్లా రాజేశ్వర్‌రెడ్డి మళ్లీ ఓట్లడిగే హక్కు లేదు : ఉత్తమ్ - telangana varthalu
నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడని పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మళ్లీ ఓట్లడిగే హక్కు లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. తెరాస సర్కారుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని ఆయన కోరారు.
పల్లా రాజేశ్వర్‌రెడ్డి మళ్లీ ఓట్లడిగే హక్కు లేదు : ఉత్తమ్
ప్రత్యేక రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారని... ఏడేళ్ల కాలంలో కేవలం 60వేల ఉద్యోగాల మాత్రమే భర్తీ చేశారన్నారు. ఏనాడు నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడని పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మళ్లీ ఓట్లడిగే హక్కులేదని చెప్పారు.
ఇదీ చదవండి: ఆర్డీఎస్ నుంచి చుక్క నీటి బొట్టును వదులుకోం: సంపత్