నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. సాగర్ ఎర్త్ డ్యామ్ నుంచి ప్రధాన జలాశయం వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద భద్రత కట్టుదిట్టం కోసం సుమారు రూ.1 కోటీ 90 లక్షల రూపాయల వ్యయంతో 62 సీసీ కెమెరాల బిగింపు పనులు ప్రారంభించారు. పోలీసు సిబ్బందికి వాకీటాకీలు, మెటల్ డిటెక్టర్స్ అందజేయనున్నారు.
నాగార్జునసాగర్ జలాశయం వద్ద కట్టుదిట్టమైన భద్రత - నాగార్జునసాగర్ జలాశయంలో స్పీడ్ బోట్లు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద భద్రత దృష్ట్యా సాగర్ ఎర్త్ డ్యామ్ నుంచి ప్రధాన జలాశయం వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జలాశయంలో భద్రత సిబ్బంది గస్తీ చేపట్టడానికి దాదాపు 20 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన రెండు స్పీడ్ బోట్లను ప్రారంభించారు.
నాగార్జునసాగర్ జలాశయం వద్ద కట్టుదిట్టమైన భద్రత
మానిటరింగ్ రూమ్‌ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. బుధవారం జలాశయంలో రెండు స్పీడ్ బోట్లను ప్రారంభించారు. భద్రత సిబ్బంది గస్తీ చేపట్టడం కోసం దాదాపు 20 లక్షల వ్యయంతో వీటిని కొనుగోలు చేశారు. నిఘా విభాగం సేవలు అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:'మిగిలిన జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌కు వెళ్లవచ్చు'