తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగార్జునసాగర్​ పరిధిలో చిరుత పాద ముద్రల కలకలం - పొలాల్లో చిరుతు పాద ముద్రలు

పొలాల్లో చిరుత పాద ముద్రలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నాగార్జునసాగర్​ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చిరుత తిరుగుతోందన్న వార్తలు... స్థానికులను వణికిస్తున్నాయి.

TIGER FOOT PRINTS IN PADI FIELDS AT NAGARJUNASAGAR
TIGER FOOT PRINTS IN PADI FIELDS AT NAGARJUNASAGAR

By

Published : Feb 11, 2020, 11:50 PM IST

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గపరిధిలోని కొత్తలూరు, ముక్కముల గ్రామాల్లోని పొలాల్లో బత్తాయి తోటల్లో పులి అడుగుల గుర్తులు స్థానికులను భయపెడుతున్నాయి. పులి తిరుగుతోందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తలూరులో చిరుత పాద ముద్రలు చూసి... స్థానికులు వెంటనే అటవీశాఖకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన అటవీ సిబ్బంది చిరుత జాడను కనుగొనే పనిలో పడ్డారు. పాద ముద్రలు పరిశీలించిన అధికారులు హైనా అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జునసాగర్​ పరిధిలో చిరుత పాద ముద్రల కలకలం

ABOUT THE AUTHOR

...view details