పేదింటి ఆడబిడ్డలకు గొప్ప వరంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిలిచాయని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 74 మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు.
'తెలంగాణ సంక్షేమ పథకాల్లో దేశానికే ఆదర్శం' - కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ వార్తలు
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో 74 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అందజేశారు. పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ పథకాలు ఎంతో మేలు చేస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు.

తుంగతుర్తి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, గాదరి కిశోర్ కుమార్, శాలిగౌరారం
పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతోందని గాదరి కిశోర్ పేర్కొన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. సంక్షోభంలోనూ ప్రభుత్వం నిధుల కొరత విధించకుండా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పథకాలతో తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.