నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలో వారసత్వంగా సంక్రమించిన భూమి విషయంలో అక్కాచెల్లెల్లు, వారి భర్తలు గొడవపడగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిర్యాలగూడ మండల పరిధిలోని జప్తి వీరప్పగూడెంలో ఎంకమ్మ అనే మహిళకు ముగ్గురు కూతుళ్లు. కొడుకులు లేకపోవడం వల్ల తనకున్న ఎకరంన్నర భూమిని ముగ్గురు కూతుళ్లకు సమానంగా పంచింది. ముగ్గురు కూతుళ్లలో ధనలక్ష్మీ, యాదమ్మలను వెంకయ్య అనే వ్యక్తికిచ్చి వివాహం చేసింది. మరో కూతురు అలివేలును మేనమామ అయిన కృష్ణయ్యకు ఇచ్చి పెళ్లి చేసింది. కాగా.. తల్లి ఇచ్చిన భూమిని ముగ్గురు తోబుట్టువులు సాగు చేసుకుంటున్నారు.
భూమి విషయంలో ఘర్షణ.. నలుగురికి తీవ్రగాయాలు! - మిర్యాలగూడ పోలీస్ స్టేషన్
తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించిన భూమి విషయంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, వారి భర్తల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలో చోటు చేసుకుంది. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో ధనలక్ష్మి, యాదమ్మలు తమ అప్పులు తీర్చడానికి తమ పేరు మీద ఉన్న ఎకరం పొలాన్ని అమ్మకానికి పెట్టారు. ఆ భూమిని ఎవరూ కొనకుండా తన చెల్లెలి భర్త, మేనమామ అయిన కృష్ణయ్య అడ్డు పడుతున్నాడు. ఈ విషయమై వారి మధ్య పలుమార్లు ఘర్షణ కూడా జరిగింది. మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. శనివారం నాడు పొలం వద్దకు వెళ్లిన ధనలక్ష్మి, యాదమ్మ, వెంకయ్యలను కృష్ణయ్య, కొడుకులతో కలిసి రాడ్లు, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆ దెబ్బలకు వెంకయ్య, ధనలక్ష్మి, యాదమ్మల కాళ్లు, చేతులు విరిగాయి. వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాద మేరకు మిర్యాల గూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి:ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ?