తెలంగాణ

telangana

ETV Bharat / state

Road accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు.. ముగ్గురి పరిస్థితి విషమం - లారీని ఢీకొన్న బస్సు

Road accident: ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ముప్పై మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కామినేని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలం లింగోటం సమీపంలో చోటుచేసుకుంది.

Road accident
Road accident

By

Published : May 16, 2022, 8:59 AM IST

Road accident: నల్గొండ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 30 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నార్కట్​పల్లి మండలం లింగోటం సమీపంలో చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని నార్కట్​పల్లి కామినేని హాస్పిటల్​కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని హైదరాబాద్​కు తరలించారు. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్​కి రెండు కాళ్లు విరిగిపోయాయి.

ఏపీలోని లింగోటం సమీపంలో జాతీయ రహదారిపై మరమ్మతుల కోసం ఆగి ఉన్న లారీని భద్రాచలం డిపోకి చెందిన ఆర్టీసి బస్సు బలంగా ఢీకొట్టింది. భద్రాచలం డిపో ఆర్టీసీ బస్సు 45 మంది ప్రయాణికులతో హైదరాబాదుకు బయలుదేరింది. నార్కట్ పల్లి శివారులోకి చేరుకోగానే ఈ ప్రమాదం జరిగింది. అయితే డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details