తొలిసారిగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 39 మంది మహిళలు జూనియర్ లైన్‌మెన్లు(Women selected as Junior Linemen)గా ఎంపికయ్యారు. ట్రాన్స్‌కోలో జూనియర్ లైన్‌మెన్ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా 2017లో జేఎల్‌ఎంల(Junior Linemen) ఉద్యోగ ప్రకటనలో మహిళలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో రాతపరీక్ష నిర్వహించింది. తదుపరి కొందరూ కోర్టును ఆశ్రయించడంతో నియామక ప్రక్రియలో జాప్యం నెలకొంది. ఇటీవల కోర్టు ఆదేశాల మేరకు మహిళలకు కల్పించారు. ఈనెల 4, 5 తేదీల్లో ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో నార్కట్‌పల్లి 220 కేవీ పరిధిలో అభ్యర్ధులకు టవర్ ఎక్కే పరీక్ష నిర్వహించారు. అందులో 83 మంది అభ్యర్థులు ఎంపీకయ్యారు. వారిలో 39 మహిళలు జూనియర్ లైన్‌మెన్లుగా ఎంపికవడం విశేషం. వీరికి ఈనెల 12న ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేశారు. ఒకటి రెండు రోజుల్లో పోస్టింగ్ ఇవ్వనున్నారు. ట్రాన్స్‌కో మాదిరిగానే ఇతర మధ్యప్రాంత, ఉత్తర ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థలో మహిళల(Women selected as Junior Linemen)కు అవకాశం కల్పించాలని డిమాండ్ వస్తుంది.
అనుకున్న లక్ష్యం సాధ్యం
అమ్మానాన్న సహకారం భర్త ప్రోత్సాహంతో ఉద్యోగం సాధించా. మా ఆయన శ్రీశైలం ఎడమగట్టు ప్రాజెక్టు (జెన్‌కో) పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్నారు. ఆయన పనిచేస్తున్న డిపార్టుమెంటులోనే ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఐటీఐ ఎలక్ట్రికల్ పూర్తి చేశా. నాకు ఇద్దరు పిల్లలు.. రెండుసార్లు శస్త్రచికిత్స అయింది. విద్యుత్తు టవర్లు ఎక్కాలంటే భయం వేసింది. హైదరాబాద్ సమీపంలో షాద్‌నగర్ తిమ్మపూర్ వద్ద వారం రోజుల పాటు టవర్ ఎక్కేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. ఈనెల 4, 5 తేదీల్లో నార్కట్‌పల్లి వద్ద నిర్వహించిన టవర్ ఎక్కే పరీక్షలో నెగ్గి అనుకున్న లక్ష్యం సాధించా.