తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్గొండ జిల్లాపై సీఎం కేసీఆర్​కు వివక్ష: జూలకంటి - CPM leader Julekanti Rangareddy Latest News

ఆంధ్ర ప్రభుత్వం శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నా సీఎం కేసీఆర్ నోరు మెదపడం లేదని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి మండిపడ్డారు. తెరాస ప్రభుత్వం పోతిరెడ్డిపాడుపై సీరియస్​గా స్పందించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.

There are many suspicions that the Telangana government Potireddipadu.
నల్గొండ జిల్లాపై సీఎం కేసీఆర్ కు వివక్ష: జూలకంటి

By

Published : May 28, 2020, 2:09 PM IST

తెరాస అధికారంలోకి వచ్చి ఆరు ఏళ్లు గడిచినా.. పెండింగ్ ప్రాజెక్టులను ఇప్పటి వరకు పూర్తి చేయలేదని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. ఒక ప్రాంతాన్ని ఎండబెట్టి మరో ప్రాంతానికి నీరు ఇచ్చారని.. ఒకరిని ఏడిపించి మరొకరిని నవ్వించడం ఆయనకే చెల్లిందని మండిపడ్డారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు 4 లక్షల 11వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. 2.50 లక్షల ఏకరాలకే సాగునీరు అందిస్తోందని విమర్శించారు.

ప్రాజెక్ట్ లపై శ్రద్ధ చూపకపోవడం లేదు

సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాపై వివక్ష చూపుతున్నారని జూలకంటి పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కూడా 20 వేల కోట్ల టెండర్లు పిలిచినా తెలంగాణ ప్రభుత్వం, ఈ ప్రాంత ప్రాజెక్ట్ ల మీద శ్రద్ధ చూపకపోవడం విడ్డూరమన్నారు. ఆంధ్ర ప్రభుత్వం శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నా సీఎం కేసీఆర్ నోరు మెదపడం లేదని మండిపడ్డారు. తెరాస ప్రభుత్వం పోతిరెడ్డిపాడు పై సీరియస్ గా స్పందించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.

ఇదీ చూడండి:మే 31 లోపు ఆస్తిపన్ను చెల్లిస్తే రాయితీ

ABOUT THE AUTHOR

...view details