theft-in-renuka-yellamma-temple-in-chinna-mandharam-village నల్గొండ జిల్లా కనగల్ మండలం చిన్న మాదారం గ్రామంలోని రేణుక ఎల్లమ్మ గుడిలో దొంగతనం(theft in renuka yellamma temple ) జరిగింది. ఇద్దరు దుండగులు హుండీని దొంగిలించారు. రెండు రోజుల నుంచి దేవాలయంలో వార్షిక బ్రహ్మత్సవాలు జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి.. అమ్మవారికి పెద్దఎత్తున కానుకలు సమర్పించుకున్నారు. ఇప్పుడైతే భారీగా గిట్టుబాటవుతుందని భావించిన దుండగులు.. అమ్మవారి హుండీపైన కన్నేశారు. పూజలు ముగించుకుని అందరూ వెళ్లిపోయాక.. అర్థరాత్రి సమయంలో హుండీని(hundi theft in renuka yellamma temple) ఎత్తుకెళ్లారు.
అర్ధరాత్రి సమయంలో..
రోజూలాగే నేడు ఉదయం ఆలయానికి వెళ్లిన భక్తులు.. హుండీ లేకపోవడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవాలయానికి చేరుకున్న పోలీసులు.. పరిసరాలు, సీసీటీవీ దృశ్యాలు పరిశీలించారు. అర్ధరాత్రి 12 గంటల 32 నిమిషాల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించారు. హుండీలో సుమారు 40 వేల రూపాయల నగదు, 100 నుంచి 200 గ్రాముల వెండి ఆభరణాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
పొదల్లో హుండీ..
హుండీని పగలగొట్టి అందులోని సొమ్మును దుండగులు ఎత్తుకెళ్లారు. హుండీని మాత్రం సమీపంలోని చెట్ల పొదల్లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు దొంగతనం చేసిన దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డవగా.. అవి ఇప్పుడు వైరల్గా మారాయి.
ఇదీ చూడండి: