నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో చేపల వేట, అమ్మకాలతో సందడి వాతావరణం నెలకొంది. శాలిగౌరారం ప్రాజెక్టులో పెద్ద పెద్ద చేపలు వలలకు చిక్కడంతో మత్స్యకారులు పండుగ చేసుకున్నారు. ఈ ప్రాజెక్టు రైతులతోపాటు వందల మంది మత్స్యకార్మికులకు జీవనాధారంగా ఉపయోగపడుతోంది.
శాలిగౌరారం ప్రాజెక్టు వద్ద జోరుగా.. చేపల గిరాకి! - Loud demand at Shaligauraram project .. Fish demand!
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో చేపల వేట, అమ్మకాలతో సందడి వాతావరణం నెలకొంది. శాలిగౌరారం ప్రాజెక్టులో భారీ చేపలు వలలకు చిక్కడంతో మత్స్యకారులు పండుగ చేసుకున్నారు. కొనుగోలు దారులతో జలాశయం వద్ద సందడి నెలకొంది.
![శాలిగౌరారం ప్రాజెక్టు వద్ద జోరుగా.. చేపల గిరాకి! The Saligauram project, which has become bustling with fish sales](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10196308-432-10196308-1610340304843.jpg)
శాలిగౌరారం ప్రాజెక్టు వద్ద జోరుగా.. చేపల గిరాకి!
కొవిడ్ కారణంగా కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్టులో చేపలు పట్టడంలేదు. ఆదివారం రోజున మత్స్య కార్మికులు వేట ప్రారంభించారు. భారీ చేపలు వలలకు చిక్కడంతో మత్స్యకారుల పంట పండింది. అనేక గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు చేపలను కొనుక్కుని వెళ్లారు. కొందరయితే జలాశయం వద్దకే వెళ్లి చేపలను కొనుగోలు చేశారు. దీంతో జలాశయం వద్ద సందడి నెలకొంది. ఏకంగా 60 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేయాల్సి వచ్చింది.