sagar gate operator injured నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ డ్యామ్‌పై ప్రమాదం జరిగింది. సాగర్ 26వ క్రస్ట్‌గేట్ ఆపరేట్ చేస్తుండగా ఫ్యాన్ విరిగింది. ఈ ఘటనలో గేట్ ఆపరేటర్ అజ్మతుల్లాకు తీవ్ర గాయాలవడంతో స్థానిక కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వైపు సాగర్ జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో 24 గేట్లు ఎత్తి 3.42లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 586.20 అడుగులకు చేరింది.
నాగార్జునసాగర్ డ్యాంపై ప్రమాదం, ఆపరేటర్‌కు తీవ్ర గాయాలు - Nagarjuna Sagar Dam
sagar gate operator injured నాగార్జునసాగర్ డ్యాంపై ప్రమాదం చోటు చేసుకుంది. సాగర్ 26 వ క్రస్ట్ గేట్ ఆపరేట్ చేస్తుండగా ఫ్యాన్ విరిగింది. ఈ ఘటనలో గేట్ ఆప్‌రేట్ చేసిన వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అజ్మతుల్లాను వెంటనే అధికారులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. సాగర్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం క్రస్ట్ గేట్ మోటార్ ఫ్యాన్ నుండి విరిగిపోయిన ఫ్యాన్ రెక్క ముక్క మోకాలి కింది భాగంలోనే ఉండిపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం గాయపడిన సిబ్బందిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అనుకోకుండా సాంకేతికపరమైన కారణాలతో జరిగిన దుర్ఘటన అని, గాయపడిన అజ్మతుల్లాకు మెరుగైన చికిత్స అందిస్తామని అధికారులు అన్నారు. అయితే ఇటీవల క్రస్ట్ గేట్ల మరమ్మతులు చేసినా ప్రమాదం జరగడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి:నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై తలసాని సమీక్ష, నిమజ్జనం ఎప్పుడంటే