కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. నల్గొండలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. పట్టణంలోని బీటీఎస్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. తన తండ్రి ఆరోగ్యం క్షీణించడం వల్ల 15 రోజులుగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. 12 రోజుల క్రితం హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స చేయించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు జిల్లా కేంద్రంలోని ఐసీయూ వార్డులో చేర్చారు.
లక్షణాలు: జ్వరం, దగ్గు, ఆయాసం
ఆసుపత్రిలో ఉన్న తండ్రికి సేవలు చేస్తున్న క్రమంలో.. యువకుడికి జ్వరం, దగ్గు, ఆయాసం లక్షణాలు కన్పించడం వల్ల స్థానిక వైద్యుల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. అతనికి పాజిటివ్ రావడం వల్ల ఆసుపత్రి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
మరో అయిదుగురికి నిర్ధరణ పరీక్షలు