తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండున్నరేళ్ల తర్వాత కుటుంబ సభ్యుల చెంతకు..

సొంత ఊరి నుంచి కుమారుడు ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. బిడ్డ కోసం అతని తల్లి, బంధువులు వెతుకుతూనే ఉన్నారు. పోలీసుల్ని సంప్రదించారు. ఇక దొరకడని ఆశలు వదులుకున్నారు. అయినా కుమారుడి కోసం ఆ తల్లి తల్లడిల్లుతూనే ఉంది. ఆమె ఆవేదనను భగవంతుడు ఆలకించాడో ఏమో... ఊరు గాని ఊరిలో కొడుకు ఆచూకీ ఉన్నట్టు సమాచారం అందింది. రెండు సంవత్సరాల ఏడు నెలలుగా ఆమె పడుతున్న బాధకు తెరపడింది. బంధువులు.. కొడుకుని తల్లి చెంతకు చేర్చారు. ఏపీ విశాఖలో ఈ సంఘటన జరిగింది.

missing
రెండున్నరేళ్ల తర్వాత కుటుంబ సభ్యుల చెంతకు..

By

Published : Dec 4, 2020, 11:29 AM IST

మతిమరుపు కారణంగా ఓ వ్యక్తి జిల్లాలు దాటి వచ్చి ఎట్టకేలకు కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. రెండున్నరేళ్లకు పైగా అతడి కోసం అన్వేషిస్తూ.. ఆశలు వదులుకున్న సమయంలో ఆచూకీ తెలియడంతో వారి సంతోషానికి అవధులులేకుండా పోయాయి.

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఇస్మాన్‌ పల్లికి చెందిన పచ్చిపాల సైదులు.. గ్రామంలోని ఓ కర్మాగారంలో కార్మికుడిగా పని చేసేవాడు. మతిమరుపు, అమాయకత్వం కారణంగా 2018 మే లో ఓ ఆర్టీసీ బస్సు ఎక్కి ఏపీలోని విశాఖ జిల్లా యలమంచిలికి చేరుకున్నాడు. అక్కడి నుంచి మళ్లీ రాజమహేంద్రవరం వచ్చాడు. అతడిని లాలా చెరువులోని స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకుడు గుబ్బల రాంబాబు చేరదీశారు. అప్పటి నుంచి సైదులు తోచిన పని చేస్తూ వృద్ధుల వద్దే ఉంటున్నాడు. ఇంటి వద్ద తల్లి యాదమ్మ, తమ్ముడు మల్లేశ్‌, బంధువులు అప్పటి నుంచి పలు చోట్ల వెతికారు.

రాజమహేంద్రవరంలో ఉంటున్న అతని మేనమామ వేంకటేశ్వరరావు సేవా సంస్థ వద్ద సైదుల్ని గుర్తించారు. వెంటనే తల్లి యాదమ్మకు సమాచారం అందించారు. ఇస్మాన్‌ పల్లి నుంచి కుటుంబ సభ్యులు గురువారం రాజమహేంద్రవరం వచ్చి సైదుల్ని తల్లి వద్దకు తీసుకెళ్లారు. గుబ్బల రాంబాబు అతడికి కొంత నగదు, దుస్తులు అందజేసి ఇంటికి పంపించారు.

ఇదీ చదవండి:ప్రశాంతంగా కౌంటింగ్​.. పోస్టల్ ఓట్లలో భాజపా ముందంజ

ABOUT THE AUTHOR

...view details